
Elon Musk NeuraLink | మనిషి మెదడులో చిప్.. ఆలోచనలతోనే యంత్రాలపై నియంత్రణ!
Elon Musk NeuraLink | Justice League సినిమా చూశారా? అందులో మనిషి మెదడులో చిప్ పెడతారు. ఆ చిప్ సాయంతో ఒక సామాన్య మనిషి అసాధారణ పనులు చేయగలుగుతాడు. ఇప్పుడు నిజజీవితంలో కూడా ఇలాంటి అద్భుతమే జరిగింది. ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్‌కు చెందిన (NEURA LINK) న్యూరా లింక్ అనే టెక్నాలజీ కంపెనీ ఈ అద్భుతాన్ని చేసి చూపించింది.
ఈ న్యూరా లింక్ ఉద్దేశం ఏమిటి? బ్రెయిన్‌లో చిప్ పెట్టి ఈ న్యూరా లింక్ ఏం సాధించాలనుకుంటోంది? .. ఈ ప్రయోగం విజయం సాధిస్తే.. ప్రపంచంపై దీని ప్రభావం ఏంటి?
Elon Musk.. ఎప్పుడూ వార్తల్లో నిలిచే బడా Businessman. Space X, Tesla, STAR LINK లాంటి దిగ్గజ కంపెనీలకు యజమాని. కొంతకాలం క్రితం మస్క్ సోషల్ మీడియా కంపెనీ Twitterని కూడా కొనుగోలు చేశారు. Twitter పిచుక పేరుని కూడా ‘X’అని మార్చారు.
ఎప్పుడూ ఏదో ఒక Tweet చేస్తూ.. సంచలనాలు, వివాదాలు చేసే మస్క్.. తన దూరదృష్టితో ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు. అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన future technology గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ.. అందులో పెట్టుబడులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన చాట్ జిపిటి టెక్నాలజీ లాంటి Artificial Intelligence కంపెనీ స్థాపన సమయంలో పెట్టుబడులు పెట్టారు.
అలాగే మరో Startup కంపెనీ NEURA LINKని కూడా ఇలాన్ మస్క్ 2016లో స్థాపించారు. ఈ కంపెనీలో ప్రస్తుతం 400 మంది ఉద్యోగులున్నారు. దీని Total funding 363 million డాలర్లు.
తాజాగా ఈ NEURA LINK కంపెనీ అద్భుతం చేసి చూపించింది. అమెరికన్ మీడియా కథనాల ప్రకారం.. ఈ NEURA LINK చేసిన ఒక ప్రయోగం అన్ని విధాలుగా successful అయితే Medical Science ప్రపంచమే మారిపోతుంది.
NEURA LINK అంతగా ఏం సాధించిందని చెప్పే ముందు.. అసలు NEURA LINK కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
2016లో ఏడుగురు scientistsల teamతో NEURA LINK startup company స్థాపన జరిగింది. Brain Computer Interface అంటే BCI అనే టెక్నాలజీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ ప్రారంభమైంది. Brain Computer Interfaceని Brain Machine Interface అని కూడా అంటారు.
Brain Computer Interface ఒక చిప్ లాంటి device. దీనిని మనిషి మెదడులో అమర్చి.. మెదడులోని Electric Activityని బయట ప్రపంచంలోని computer లేదా Robotic machineతో connect చేస్తారు.
ఈ టెక్నాలజీతో కాళ్లు, చేతులు లేని వికలాంగులు లేదా పక్షవాతంతో బాధపడేవారు తమ daily lifeలోని పనులు easyగా చేసుకోగలరు. అందుకే దీనిపేరు NEURA LINK అని పెట్టారు.
ఈ NEURA LINK story నిజానికి 1970లోనే ప్రారంభమైంది. 1970లో Jacques J Vidal అనే ఒక scientist University of California- National Science Foundation అనుమతి తీసుకొని NEURA LINK ప్రయోగాలు మొదలుపెట్టారు. 1973లో Jacques Vidal రాసిన ఒక Article science Journalలో print అయింది. ఈ Article ద్వారానే NEURA LINK ప్రయోగాల గురించి ప్రపంచానికి తొలిసారి తెలిసింది.
ఈ ప్రయోగాల గురించి చెప్పాలంటే.. NEURA LINK టెక్నాలజీతో మనిషి మెదడుని అధ్యయనం చేయడం. అందుకే Elon Musk ఈ Experiments గురించి మాట్లాడుతూ.. Understanding the Brain, Interfacing the Brain, Engineering with the Brain, అనే సిద్ధాంతాలపై NEURA LINK పనిచేస్తోందన్నారు.

Comment / Reply From
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!