Dark Mode
Image
  • Friday, 09 May 2025
Gossip Garage : ఆళ్లనాని సైకిల్‌ సవారీకి తమ్ముళ్ల బ్రేకులు..! ఆయన రాకను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..?

Gossip Garage : ఆళ్లనాని సైకిల్‌ సవారీకి తమ్ముళ్ల బ్రేకులు..! ఆయన రాకను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..?

ఆళ్లనానిని టీడీపీలో చేర్చుకుంటే మాత్రం ఏలూరు రాజకీయాల్లో..పొలిటికల్ రివర్స్ పంపింగ్ జరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

Gossip Garage : ఫ్యాన్ గాలి ఆగిపోయింది. ఆ వెంటనే ఆయన పక్కకు తప్పుకున్నారు. ఆరు నెలలు ఆగారు. ఇప్పుడు సైకిల్ సవారీకి రెడీ అయ్యారు. కానీ ఆయన రాకకు తెలుగు తమ్ముళ్లు బ్రేకులు వేస్తున్నారు. దాంతో పచ్చకండువా కప్పుకుందామనుకున్న ఆ నేతకు ఇప్పుడు ఎటూ తోయడం లేదట. ఆ మాజీమంత్రి ఎంట్రీకి అబ్జక్షన్ తెలుపుతున్న లీడర్లను సముదాయించే పనిలో పడిందట టీడీపీ అధిష్టానం. ఇంతకీ ఎవరా నేత.? ఆయన రాకను వ్యతిరేకిస్తున్నదెవరు? లోకల్ లీడర్లు వద్దంటున్నా..ఆ లీడర్‌ చేరికకు టీడీపీ అధినేత గ్రీన్‌సిగ్నల్ ఎందుకు ఇస్తున్నట్లు?

అందరి కంటే ముందు వైసీపీకి రిజైన్‌..
అధికారంలో ఉన్న పార్టీ అంటే అందరికీ ఇష్టమే. అపోజిషన్‌లోకి వచ్చేసరికి ఎవరి దారి వాళ్లు వెతుక్కుంటారు. ఇప్పటివరకు ఏ పార్టీ హిస్టరీ చూసినా ఇదే సీన్‌ కనిపిస్తుంటుంది. దీనికి వైసీపీ కూడా అతీతం కాదని.. ఆరు నెలలుగా జరుగుతోన్న డెవలప్‌మెంట్స్‌ను బట్టి అర్థమవుతోంది. వైసీపీ పవర్‌లో ఉన్నప్పుడు ఓ ఊపు ఊపిన నేతలంతా ఓడిపోయాక పార్టీకి, అధినేతకు హ్యాండ్ ఇస్తున్నారు. అలాంటి నేతల్లో ఆళ్లనాటి మొదటి వరుసలో ఉన్నారు. అందరి కంటే ముందు వైసీపీకి రిజైన్‌ చేసిన ఆయన ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండిపోయారు. ఆ మధ్య నాని జనసేనలోకి వెళ్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఫైనల్‌గా సైకిల్‌ సవారీకి రెడీ అయ్యారాయన.

ఆళ్లనాని రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమ్ముళ్లు..
టీడీపీ అధినాయకత్వం కూడా ఆళ్లనాని చేరికకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ఇవాళో రేపో చేరుదామనుకుంటున్న సమయంలో..టీడీపీలో ఆయన జాయినింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. దీనికి కారణం ఆళ్లనాని చేరికను స్థానిక టీడీపీ లీడర్లు తీవ్రంగా వ్యతిరేకించడమే. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలను, కార్యకర్తలను ఆళ్లనాని తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, అలాంటి వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని తెలుగు తమ్ముళ్లు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారట. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ కూడా ఆళ్లనాని చేరికను వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు ఆళ్లనాని టీడీపీలో చేరితే కొంతమంది లోకల్ టీడీపీ లీడర్లు సైకిల్ దిగేందుకు రెడీ అవుతున్నారట.

ఆళ్లనాని టీడీపీలో చేరితే ఏలూరు మాజీ ఈడా ఛైర్మన్ ఈశ్వరీ బలరాం పార్టీకి దూరం అవుతారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నపుడు బలరాం, ఈశ్వరీ దంపతులు వైసీపీలో కీలకంగా ఉన్నారు. ఏలూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. అయితే తమకు రెండోసారి ఆ పోస్ట్‌ను కంటిన్యూ చేయకుండా ఆళ్లనాని అడ్డుకున్నారన్న కారణంతోనే ఈశ్వరీ బలరాం దంపతులు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఆళ్లనాని ఓటమికి..టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ గెలుపు కోసం ఎమ్మార్డీ ఈశ్వరీ బలరాం గట్టిగానే కష్టపడ్డారు.

వైసీపీలో ఉన్నప్పుడు ఆళ్లనాని తమకు అన్యాయం చేశారన్న కోపంతో ఉన్నారు బలరాం, ఈశ్వరీ దంపతులు. అందుకే నానిని టీడీపీ పార్టీలో చేర్చుకుంటామనడంపై ఆగ్రహంగా ఉన్నారట. ఆళ్లనాని టీడీపీలోకి వస్తే మాత్రం సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారట. ఏలూరు జిల్లా వైసీపీ రాజకీయాలు చూస్తోన్న కోటగిరి శ్రీధర్‌తో ఈశ్వరీ బలరాంకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సాన్నిహిత్యంతోనే ఈశ్వరీ బలరాం దంపతులు మళ్లీ వైసీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఏలూరు రాజకీయాల్లో ఆళ్లనానిది ఓ బ్రాండ్. దశాబ్దాల తరబడి ఆయన ఈ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, వైసీపీలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయంగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆళ్లనాని, గత ఎన్నికల్లో ఓడిపోయారు. వెంటనే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే కొద్ది రోజుల క్రితమే టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు.

ఈ నేపథ్యంలోనే ఆయన రాకకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అయితే నాని చేరిక ఇష్యూను టీడీపీ అధిష్టానం ఎలా సెటిల్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ లోకల్ లీడర్ల ఒత్తిడికి తలొగ్గి నాని జాయినింగ్‌పై టీడీపీ అగ్రనాయకత్వం వెనక్కి తగ్గుతుందా లేక ఎవరు అభ్యంతరం తెలిపినా చేర్చుకుంటారా అనేది పెద్ద క్వశ్చన్‌గా మారింది. ఆళ్లనానిని టీడీపీలో చేర్చుకుంటే మాత్రం ఏలూరు రాజకీయాల్లో..పొలిటికల్ రివర్స్ పంపింగ్ జరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!