
Tammareddy Bharadwaja : అది అజెండా లేని మీటింగ్.. తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ వైరల్
ఇటీవల సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పై ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పై ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం నిర్వహించిన భేటీకి తాను వెళ్లలేదని, అయితే.. ఆ సమావేశం బాగా జరిగిందని, బెస్ట్ మీటింగ్ అని అక్కడకు వెళ్లిన వాళ్లు తనతో చెప్పారన్నారు. అయితే.. అది ఓ అజెండా లేని మీటింగ్ అని అన్నారు.
ఈ భేటీతో ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ వచ్చిందనే అపోహలు తొలగిపోయినట్లేనని తెలిపారు. ఆ భేటీలో సినిమా వాళ్లు సినిమాల గురించి మాట్లాడలేదన్నారు. ఇండస్ట్రీ అభివృధ్ధికి ప్రభుత్వం నుంచి మరింత సహకారం కోరడానికే వెళ్లారన్నారు. ఇక ప్రభుత్వం చేపట్టే సామాజిక చైతన్య కార్యక్రమాలపై నటీ నటులంతా సపోర్టు చేస్తూనే ఉన్నామన్నారు.
అందరిని సమన్వయపరచడానికే ఫిల్మ్ ఛాంబర్ ఉందన్నారు. గతంలో ఫిల్మ్ ఛాంబర్ తరుపున తాము ప్రభుత్వాన్ని కలిశామన్నారు. గద్దర్ అవార్డు విషయంలో పలు సూచనలు చేసినట్లుగా తెలిపారు. గతంలో కొన్ని సినిమాలను తాము బెనిఫిట్ షోలు వేశామని, అయితే.. అవి ఉచితంగానే ప్రదర్శించామని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. దీని పై నిర్మాతలు, ప్రేక్షకులు ఆలోచించాలన్నారు. 20 ఏళ్ల నుంచి చెబుతున్నా బెనిఫిట్ షో లు వద్దని, ప్రీమియర్ షో అనేది క్యాష్ చేసుకోవడానికే అన్నారు.
5 వందల కోట్ల బడ్జెట్ పెడితే వెయ్యి కోట్లు వస్తుంది. ప్రీమియర్ షో కి వంద కోట్ల లాభం వస్తుందే అనుకుందాం. ఆ వంద పోతే ఏమవుతుంది? అని ప్రశ్నించారు. ఇందుకోసం ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. పుష్ప2 మూవీతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు మరింత గుర్తింపు వచ్చిందని, మనం ఇప్పటికే ఇంటర్నేషనల్ స్థాయికి చేరామన్నారు. అన్ని భాషల్లోనూ చిత్రాలను తీసుకున్నామని, ప్రేక్షకులను అలరిస్తున్నామని చెప్పారు.
ఇక ఇండస్ట్రీ వాళ్లకు ప్రభుత్వం దగ్గరకు తరచూ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఏదైన సమస్యలు ఉన్నప్పుడే కలుస్తామని తెలిపారు. బర్త్డే కు విషెస్ చెప్పలేదని అసలు విషయం కాదన్నారు. అందరూ అందరినీ విష్ చేయలేరు గదా అని ప్రశ్నించారు. గతంలో సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేందుకు 40 ఏళ్లు సమయం పట్టిందని, ఇప్పుడు మరో చోటకు వెళ్లాలన్నా అంతే సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అయితే.. ఇండస్ట్రీ ఎక్కడికి పోదని, ఇక్కడే ఉంటుందన్నారు.
Comment / Reply From
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!